ఉప్పల్ స్టేడియంలో నిమ్మకాయ మాయ.. నిజంగా మంత్రం వేశాడా?.. వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చిన సతీష్!

  • ఐపీఎల్ మ్యాచ్‌లో నిమ్మకాయతో మంత్రం వేస్తున్న వీడియో వైరల్
  • శివమ్ దూబే బ్యాటింగ్ చేస్తుండగా ఘటన.. వెంటనే వికెట్
  • వీడియోతో రాత్రికి రాత్రే ఫేమస్ అయిన యూట్యూబర్ సతీష్
  • అది మ్యాజిక్ కాదని.. వీడియో కోసమే చేశానని క్లారిటీ
ఐపీఎల్ మ్యాచ్‌లు అంటేనే ఎన్నో ఆసక్తికర సంఘటనలకు వేదిక. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఉప్ప‌ల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఓ యూట్యూబర్ నిమ్మకాయతో మంత్రం వేసినట్లు నటించడం, ఆ వెంటనే వికెట్ పడటంతో అతను రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు.

వివరాల్లోకి వెళితే... 'సన్నీ టాక్స్' ఫేమ్, యూట్యూబర్ సతీష్.. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్లాడు. చెన్నై బ్యాటర్ శివమ్ దూబే క్రీజులో ఉన్నప్పుడు, సతీష్ తన చేతిలో ఉన్న నిమ్మకాయను చూపిస్తూ ఏదో మంత్రం చదువుతున్నట్లు నటించాడు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాతి బాల్‌కే దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో మ్యాచ్ హైదరాబాద్ వైపు మొగ్గు చూపింది. ఈ దృశ్యాలు రికార్డ్ కావడంతో వీడియో 'ఎక్స్' (ట్విట్ట‌ర్)తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది.

వీడియో వైరల్ కావడంతో సతీష్‌కు ఊహించని పాప్యులారిటీ వచ్చింది. మీడియా సంస్థలు కూడా అతడిని సంప్రదించాయి. ఈ సందర్భంగా సతీష్ అసలు విషయం వెల్లడించాడు. తాను ఎలాంటి మంత్రం వేయలేదని స్పష్టం చేశాడు. కేవలం ఫన్నీ వీడియో కోసం నాలుగైదు సార్లు ప్రయత్నించగా, చివరిసారికి వికెట్ పడిందని చెప్పాడు. తన రియాక్షన్ కూడా ఒరిజినల్‌గా ఉండటం, దాన్ని నీట్‌గా ఎడిట్ చేసి పోస్ట్ చేయడంతో వైరల్ అయిందని వివరించాడు.

ఏదేమైనా ఈ ఒక్క వీడియోతో సతీష్ ఇప్పుడు 'నిమ్మకాయ మంత్రగాడు'గా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు. తాను సరదాకి చేసిన పని ఈ స్థాయిలో పాప్యులర్ అవుతుందని ఊహించలేదని అతను పేర్కొన్నాడు.


Viral Video
SRH Vs CSK
Lemmon Magic
Black Magic
Black Magic Video
Uppal Stadium

More Telugu News